Wednesday, June 3, 2015

Pathetic Songg ...

ప||
దాచేదెలా నేనీ బాధనే ..... ఆపేదెలా ఈ కన్నేళ్ళనే .....
గుండెల్లో నీకే గుడి కట్టానే ..... గుడిలోన దేవతలా నిను పెట్టానే ....
ఓ క్షణమే వరమై వచ్చి , మరు క్షణమే కసిగా వరదై నన్నే ముంచావే ..... 
ఓ ప్రేమా ..... నా ప్రేమా .....
                                                                        || దాచేదెలా ||
చ1 ||
నా ఊపిరి , ఆయువు నీవే ..... నా గుండెకు చప్పుడు నీవే .....
ఆ చప్పుడు చప్పున ఆపేస్తావా నీకిది న్యాయమా .....
నా శ్వాసకు ఊపిరి  నీవే ..... నా ఊహకు రూపువు నీవే .....
నా ఊహకు ఊపిరి ఆపేసావే ఏం చేయాలే చెప్పవే ప్రేమా .....
                                                                        || దాచేదెలా ||
చ2  ||
నా పాటకి పల్లవి నీవే ..... నడిపించే చరణం నీవే .....
నా బ్రతుకుకి అర్ధం నీవే అర్ధం అవుతుందా .....
నా కంటికి చూపువు నీవే ..... నా నిదురన కలవు నీవే .....
నా కలలకు రూపం ఇచ్చిన నీవే నిలువున కూల్చి ఎటు పోయావే .....

                                                                        || దాచేదెలా ||

ఆ తరం అమ్మమ్మ -- ఈ తరం అమ్మాయి -- మధ్యలో అమాయకపు అమ్మ!!! Episode 2

Episode 2 ప్రభ ఈతరం అమ్మాయి , తన హద్దుల్లో తానుండేది , friends gang లో   అబ్బాయిలున్నప్పటికీ వాళ్ళకి ఎప్పుడూ అతి చనువు ఇచ్ఛ...