Saturday, March 28, 2020

ఆ తరం అమ్మమ్మ -- ఈ తరం అమ్మాయి -- మధ్యలో అమాయకపు అమ్మ!!!

ముందు మాట 


           రాయాలి అనే విత్తనాన్ని నా మెదడులో వేసి, రాతలో నడకలు నేర్పి, అనుక్షణం మమ్మల్ని రాయమని ప్రోత్సహించి, తన చివరి క్షణం వరకు ఎదో ఒకటి చదువుతూ / రాస్తూ గడిపిన మా అమ్మమ్మ గారు శ్రీమతి నూతలపాటి ప్రభావతి అమరేశ్వరరావు గారికి అంకితం ....

ఇందులోని పాత్రలు కేవలం కల్పితం ఎవరిని ఉద్దేశించినవి కాదు .....


ఇది నేను చేసిన మొదటి ప్రయత్నం, తప్పకుండ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ... చదివిన తర్వాత మీ సలహాలు Comments లో ఇవ్వండి, దయచేసి నా blogని follow అవ్వండి .... 


EPISODE - 1

కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే | ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ||….

సుప్రభాతం శబ్దానికి చిరాగ్గా కళ్ళు నలుపుకుంటూ లేచింది ప్రభ ... అమ్మమ్మ ఒకటి Sunday కూడా నిద్రపోనివ్వకుండా పొద్దున్నే సుప్రభాతం పెట్టి లేపేస్తుంది అని phone చూస్తూ bed మీద నుండి దిగి hallలోకి  నడుచుకుంటూ వచ్చింది. "ఇదిగో వచ్చింది మైసూరు మహారాణి, coffee ఇఛ్చి లేపలేదని కంపలా మీద పడకముందే త్వరగా coffee cup తీసుకుని రా …" అన్న అమ్మమ్మ మాటలు వింటూనే పుండు మీద కారం చల్లినట్లు లేచింది ప్రభావతి.

ఇదిగో అమ్మమ్మ ఏదైనా నేను మా అమ్మ చూసుకుంటాం, మధ్యలో నువ్వు రాకు, ముసలి దానివి కృష్ణ రామ అనుకుంటూ కూర్చోక నీకెందుకు నా గురించి! అని కసురుకుని వంటింట్లోకి వెళ్ళి అమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ, అసలు ఎలా భరిస్తున్నావమ్మా tortureని ఇన్నేళ్ళుగా అని అడిగింది ప్రభా. దానికి సమాధానం అన్నట్లుగా ఎప్పటి లాగానే సుగుణ ఒక చిన్న నవ్వు నవ్వింది. ఏంటో మీ తల్లి కూతుళ్ళు నాకర్ధం కారు, ఈమేమో సూర్యకాంతం నువ్వేమో సావిత్రి అనుకుంటూ ప్రభ మళ్ళీ తన phoneలో మునిగిపోయింది.

తనని disturb చేయడానికే ఉన్నట్లుగా మళ్ళీ అమ్మమ్మ వచ్చి ఇదిగో నేను ఆనాటి సూర్యకాంతం అయితే, నువ్వు  ఈకాలం సూర్యకాంతంవే ... అందుకే నీకు నాపేరు పెట్టారు, ఇద్దరం ఒకే రకం అని అంటూ బయటకి వెళ్ళింది ప్రభావతమ్మ ... అమ్మ ప్రభావతమ్మ పేరునే  తన కూతురికి పెట్టుకుంది సుగుణ, దాన్ని కూతురు trendyగా  ప్రభ అని మార్చుకుంది.

వయసు 70లో ఉన్నా కూడా బయట పనులన్నీ ప్రభావతమ్మే చూసుకుంటుంది. భర్త ఆస్తినంతా హారతి కర్పూరంలా తగలేసి వెళ్ళిపోయాడు, తన పుట్టింటి వాళ్ళిచ్చిన ఇంటిని జాగ్రత్తగా కాపాడుకుని అదే కట్నంగా ఇచ్చి కూతురి పెళ్ళి చేసింది ప్రభావతమ్మ. పెళ్ళి అయిన సంవత్సరానికి కూతురు కాన్పుకని దింపెళ్ళిన అల్లుడు మళ్ళీ రాలేదు. రాయి ఉలిదెబ్బలు తిని నిలబడి శిల్పం అయినట్లు, ఇలా దెబ్బమీద దెబ్బలు తిన్న ప్రభావతమ్మ ఎవరి మీద ఆధారపడకుండా, వాళ్ళకున్న ఒకే ఆస్తి ఇంటిని అద్దెకిచ్చి అవి వసూలు చేస్తూ కుటుంబానికి అన్ని తానై నిలబడింది.

మొదటి నుండి కొంచెం బెరుగ్గానే ఉండే సుగుణ, భర్త ఏమయ్యాడు అనే చుట్టుపక్కల వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అన్నిటికి సమాధానంగా ఒక చిరునవ్వు నవ్వడం నేర్చునుకుంది.

అమ్మమ్మతో ఘడియకో గొడవ, పూటకో పేచీ పడుతూ ... చిన్న తనం నుండే మన ప్రభ తెలియకుండానే తరం ప్రభావతిలా తయారయింది.....

స్నేహితులు పార్టీలు అంటూ పెద్దగా తిరగక పోయినా, తనకున్న చిన్నపాటి friends circleతో  బాగానే మాట్లాడుతూ, chatting గట్రా చేస్తూండేది ప్రభ ... పక్కనున్నోళ్ళని పట్టించుకోరు కానీ, ఎక్కడో ఉన్నోళ్ళ క్షేమ సమాచారాలు అడుగుతుంటారు whatsappల్లో అనుకుంటూ చిర్రుబుర్రులాడుతూండేది ప్రభావతమ్మ ... ఇద్దరి విసుర్లు చూస్తూ నవ్వుతూ మధ్యలో మన సుగుణ ...



                సశేషం ... next episodeతో మళ్ళీ కలుద్దాం .....

No comments:

Post a Comment

ఆ తరం అమ్మమ్మ -- ఈ తరం అమ్మాయి -- మధ్యలో అమాయకపు అమ్మ!!! Episode 2

Episode 2 ప్రభ ఈతరం అమ్మాయి , తన హద్దుల్లో తానుండేది , friends gang లో   అబ్బాయిలున్నప్పటికీ వాళ్ళకి ఎప్పుడూ అతి చనువు ఇచ్ఛ...