Friday, January 8, 2016

నీకేమయ్యా IT బాబు .....

కూటి కోసం , కూలి కోసం , పట్టణంలో బ్రతుకుదామని .... తల్లిదండ్రులనింట విడిచి , బయలుదేరిన IT బాబుకి ఎంత కష్టం , ఎంత కష్టం .....
2 గదులు నిండా ఉండవు , ఇంటి అద్దె 5 అంకెలు ..... ఏంటయ్యా బాబు ఇది అంటే వచ్చే answer " నీకేమయ్యా IT బాబు " .....
break fast , auto fare ఏది చూసినా double double ..... ఇదేంటయ్యా స్వామీ అంటే వచ్చే reply " నీకేమయ్యా IT బాబు " .....

huff  ..... చాలీ చాలని break fast తో , share autoలో sideకి కూర్చుని officeకి  వెళ్తే ..... shift time 10 min late అని escalation మీద పడితే .....
managerతో బండ బూతులు , increment లో 2 కోతలు , client call లో పిచ్చి కూతలు .... ఏంటి నా life అని తిట్టుకుంటూ మళ్ళీ అదే chairలో keyboard కొట్టుకోవడమే రా బతుకు ఈ IT బాబుది ....

పొద్దున్న సూర్యుణ్ణి చూడము , రాత్రి 10కి ముందు ఇల్లు చేరము , ఫుడ్ సంగతి దేవుడెరుగు , bed ఎక్కితే నిద్ర రాదు ..... పొరపాటున నిద్ర పట్టినా అందులోను రేపు చేసే work గురించి పిచ్చి కలలు ..... ఇది రా బాబు అని చెప్పినా నమ్మని లోకం .....
గంటలకొద్దీ చాకిరీ చేసి , leave అనే question లేకుండా పని చేసి , trainings exams అంటూ అన్ని clear చేసి ..... సంవత్సరాంతంలో వచ్చే increment  కాచుకొని కూర్చుంటే ....

వచ్చింది ఆ సమయం కూడా నా appraisal time , managerతో , manager గారి managerతో  , వారి manager తో కూడా  appraisal discussions అయ్యాక వచ్చిన increment single digit , పెరిగిన జీతం నెలకి double digit లో .....
సర్లే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం రా భగవంతుడా అనుకుంటే , tax slab change అని take home ముందుకన్నా తక్కువోస్తే ..... బయటకి వెళ్ళడానికేమో recession , అదే companyలో ఉండలేని position , totalగా short cutలో ఇవి మా బ్రతుకులు .....

So అందరికి నా విన్నపం , Please ఇంకెప్పుడు నా లాంటి బక్కచిక్కిన white collar labour ని చూసి అనద్దు " నీకేమయ్యా IT బాబు అని " .....  

ఆ తరం అమ్మమ్మ -- ఈ తరం అమ్మాయి -- మధ్యలో అమాయకపు అమ్మ!!! Episode 2

Episode 2 ప్రభ ఈతరం అమ్మాయి , తన హద్దుల్లో తానుండేది , friends gang లో   అబ్బాయిలున్నప్పటికీ వాళ్ళకి ఎప్పుడూ అతి చనువు ఇచ్ఛ...