Episode 2
ప్రభ
ఈతరం అమ్మాయి, తన హద్దుల్లో తానుండేది,
friends gangలో అబ్బాయిలున్నప్పటికీ
వాళ్ళకి ఎప్పుడూ అతి చనువు ఇచ్ఛేది
కాదు ... ఇలా సాగుతున్న సమయంలో
పరీక్షలు దగ్గరికి వచ్చాయి. స్వతహాగా తెలివిగల పిల్లైనా ప్రభకి electronics subjects అంటే భయం. ఆ
భయంతోనే తాను చదివే collegeలో
ECEలో seat వచ్చినా వద్దని CSE బ్రాంచ్ తీసుకుంది. పక్కింటి aunty వాళ్ళ అబ్బాయికి నీకన్నా పెద్ద ర్యాంకు వచ్చింది కానీ వాడు ECE తీసుకున్నాట్ట
మీ కాలేజీలోనే. ECE తీసుకుంటే కావాలంటే electronics వైపైనా వెళ్లచ్చుట, Software job అయినా చేయచ్చుట... మన ఇష్టం అట,
ఎంతమంది చెప్పినా వినకుండా నువ్వేమో computer తెలుకున్నావ్ అంటూ అమ్మమ్మ దెప్పిపొడిచినా
తన నిర్ణయం ప్రకారమే CSEలో join అయింది ప్రభ. కానీ పాపం B.TECH ప్రతి
branchలో వేరే branch subjects ఏవో ఒకటి ఉంటాయి
అని తర్వాతే తెలుసుకుంది ... B.Tech 1st
yearలో distinction
percentageలో pass అయిన ప్రభకి, 2nd yearలో
EDC subject దెబ్బకి పరీక్షల భయం పట్టుకుంది ...
college first కాకున్నా ఎపుడూ top 5లో మాత్రం ఉండే
ప్రభ, ఈ సారి మాత్రం
EDC దెబ్బకి బెదిరిపోయి exam fever తెచ్చుకుంది ... 24/7 watsapp groupలో activeగా ఉండే ప్రభ
నుండి 2 రోజులుగా messages లేకపోవడంతో, తన friend యాస్మిన్ ఏమయిందో కనుక్కుందాం అని
ఇంటికి వచ్చి, అసలు విషయం తెలుసుకుని "మా అన్నయ్య ఉన్నాడుగా ఆమీర్ తాను ECEలో
మన university topper, tuitions కూడా చెప్తుంటాడు మనకు next week నుండి ఎలాగూ
preparation holidays కాబట్టి, నువ్వు మా ఇంటికిరా, ఇద్దరికీ ఒకేసారి EDC cover చేస్తాడు"
అని చెప్పి బయల్దేరుతుంది ... doctor ఇచ్చిన మందుల కన్నా యాస్మిన్ మాటలు ఇచ్చిన ధైర్యానికే
జ్వరం తగ్గినట్టయింది ప్రభకి.
ఒక 3 రోజుల్లో జ్వరం
నుండి కోలుకున్న ప్రభ, తన పరీక్షలకి పెద్దగా
time లేదని, యాస్మిన్ వాళ్ళ ఇంటికి combine studiesకి వెళ్తానని సుగణతో
చెప్పడం విన్న ప్రభావతమ్మ ... అదేమిటే వాళ్ళేమిటి మనమేమిటి అంటూ సొంటూ లేకుండా
అని ఎదో చెప్పబోతున్న పెద్దావిడని
ఆగమన్నట్టు సైగ చేసిన ప్రభ
నాకు తెలుసులే అంటూ books తీసుకుని "అమ్మా నేను యాస్మిన్ వాళ్ళింటికి
combine studiesకి వెళ్తున్నా వంట చేయద్దు" అని
అమ్మమ్మకి వినపడేలా చెప్పి వెళ్తుంది ... అది విన్న ప్రభావతమ్మ
అగ్గి మీద గుగ్గిలమైనట్టు "ఇదంతా నువ్వు
ఇచ్చిన చనువే, అది ఏమి అడిగినా
ఒక్క మాట కూడా ఎదురుచెప్పవు
అని కూతురు మీద ఎగురుతుంది" ... షరా మామూలే
అన్నట్టు సుగుణమ్మ "నేనేం చేయనమ్మా" అని ఓ
నవ్వు నవ్వి తన ఇంటి పనిలో
పడిపోతుంది ... ప్రభ చేసిన పనికన్నా,
తన మాట పట్టనట్టు వాళ్ళ
అమ్మతో చెప్పి వెళ్ళడంతో ఊగిపోయిన పెద్దావిడ "అది మాట్లాడే దాక
నేను మాత్రం దానితో మాట్లాడను" అని మంగమ్మ శబధం
చేసి కూర్చుంది ...
సశేషం ... next episodeతో మళ్ళీ కలుద్దాం
.....