Thursday, November 7, 2013

ప || white dressలోన angel తొలిసారి నేనిను చూసిన క్షణములు ,
facebookలోన chatting నిదురన్నదే మరి మరచిన దినములు ,
friday night shopping అలుపన్నదే మరి ఎరుగని కరములు ,
weekendsలోన outing పద పద పద పదమని తరిమిన పదములు ,

only for you ఈ feeling only for you .........
never i feel it , ఈ feeling only for you .........

చ ||
      he  - మాటలాడు కళ్ళు
      she - when ever i anger @ you
      he - పులకరించు ఒళ్ళు
      she - when ever i touch you
      he - పగటి పూట కలలు
      she  - ఆ కలలో నీతో ఉన్నది ఎవరో
      he  - ప్రతి కలలో మనమే , i never ever leave you

నా లోకమంత నీవే ....... నిండి ఉన్నావే .....
నిను వీడిన క్షణమే , మరు క్షణమే అన్నది ఉండదు నాకే , ఉండదు నాకే , ఉండదు నాకే .....

                                                                || white dressలోన angel  ||

Saturday, May 11, 2013

Dedicating to lovely MOMmmmmmmmmmmmmmm ...... I love U maaa :)



నే కనుపాపన బంధించిన తొలి రూపం అమ్మ , నను కనురెప్పగా కాపాడిన నా దేవత అమ్మ

స్వరపేటికలో పలికే తీయని పేరే అమ్మ , వెన్నంటి నిలిచే ఆధారమే అమ్మ

భువిపై ప్రతి మనిషికి సృష్టికర్త బ్రహ్మ , ఆ బ్రహ్మకు కూడా వుంది కదా అమ్మ

                                                                                                                  || నే కనుపాపన బంధించిన ||

కడుపులోన వున్నపుడు కాలితోటి తన్తుంటే , నా బిడ్డ నా బిడ్డని నవ్వుకుంటూ తిరిగావు

పుడుతూనే పురిటిలోనే నరకాన్నే చూపాను , పెరుగుతుంటే నీ ఒడిలో స్వర్గాన్ని చూపావు

అణువులా వచ్చాను , ఆయువే పోసావు

పేగు తెంచి పుట్టాను , ప్రేమ పంచి  పెట్టావు

                                                                                                                   || నే కనుపాపన బంధించిన ||

నా కంటిలో నలుసుకే నీ కళ్ళు చెమర్చాయి , నీ జోల పాటకవి కునుకమ్మని చేరాయి

చిన్న బాధ వస్తేనే తల్లడిల్లి పోయావు , తల్లిపేగు మమకారం కళ్ళలోనే చూపావు

నీ తోడే లేనిదే నా జన్మే శూన్యం , నీ నీడే దొరికిన ఈ  జన్మే ధన్యం

ఎన్నెన్ని జన్మలున్నా ప్రతి జన్మలోనా నీ బిడ్డగా పుట్టాలని వరం కోరుకోనా ......

                                                                                                                    || నే కనుపాపన బంధించిన ||

ఆ తరం అమ్మమ్మ -- ఈ తరం అమ్మాయి -- మధ్యలో అమాయకపు అమ్మ!!! Episode 2

Episode 2 ప్రభ ఈతరం అమ్మాయి , తన హద్దుల్లో తానుండేది , friends gang లో   అబ్బాయిలున్నప్పటికీ వాళ్ళకి ఎప్పుడూ అతి చనువు ఇచ్ఛ...