నే కనుపాపన బంధించిన తొలి రూపం అమ్మ , నను కనురెప్పగా కాపాడిన నా దేవత అమ్మ
స్వరపేటికలో పలికే తీయని పేరే అమ్మ , వెన్నంటి నిలిచే ఆధారమే అమ్మ
భువిపై ప్రతి మనిషికి సృష్టికర్త బ్రహ్మ , ఆ బ్రహ్మకు కూడా వుంది కదా అమ్మ
|| నే కనుపాపన బంధించిన ||
కడుపులోన వున్నపుడు కాలితోటి తన్తుంటే , నా బిడ్డ నా బిడ్డని నవ్వుకుంటూ తిరిగావు
పుడుతూనే పురిటిలోనే నరకాన్నే చూపాను , పెరుగుతుంటే నీ ఒడిలో స్వర్గాన్ని చూపావు
అణువులా వచ్చాను , ఆయువే పోసావు
పేగు తెంచి పుట్టాను , ప్రేమ పంచి పెట్టావు
|| నే కనుపాపన బంధించిన ||
నా కంటిలో నలుసుకే నీ కళ్ళు చెమర్చాయి , నీ జోల పాటకవి కునుకమ్మని చేరాయి
చిన్న బాధ వస్తేనే తల్లడిల్లి పోయావు , తల్లిపేగు మమకారం కళ్ళలోనే చూపావు
నీ తోడే లేనిదే నా జన్మే శూన్యం , నీ నీడే దొరికిన ఈ జన్మే ధన్యం
ఎన్నెన్ని జన్మలున్నా ప్రతి జన్మలోనా నీ బిడ్డగా పుట్టాలని వరం కోరుకోనా ......
|| నే కనుపాపన బంధించిన ||
No comments:
Post a Comment