Wednesday, June 3, 2015

Pathetic Songg ...

ప||
దాచేదెలా నేనీ బాధనే ..... ఆపేదెలా ఈ కన్నేళ్ళనే .....
గుండెల్లో నీకే గుడి కట్టానే ..... గుడిలోన దేవతలా నిను పెట్టానే ....
ఓ క్షణమే వరమై వచ్చి , మరు క్షణమే కసిగా వరదై నన్నే ముంచావే ..... 
ఓ ప్రేమా ..... నా ప్రేమా .....
                                                                        || దాచేదెలా ||
చ1 ||
నా ఊపిరి , ఆయువు నీవే ..... నా గుండెకు చప్పుడు నీవే .....
ఆ చప్పుడు చప్పున ఆపేస్తావా నీకిది న్యాయమా .....
నా శ్వాసకు ఊపిరి  నీవే ..... నా ఊహకు రూపువు నీవే .....
నా ఊహకు ఊపిరి ఆపేసావే ఏం చేయాలే చెప్పవే ప్రేమా .....
                                                                        || దాచేదెలా ||
చ2  ||
నా పాటకి పల్లవి నీవే ..... నడిపించే చరణం నీవే .....
నా బ్రతుకుకి అర్ధం నీవే అర్ధం అవుతుందా .....
నా కంటికి చూపువు నీవే ..... నా నిదురన కలవు నీవే .....
నా కలలకు రూపం ఇచ్చిన నీవే నిలువున కూల్చి ఎటు పోయావే .....

                                                                        || దాచేదెలా ||

Sunday, January 4, 2015

Premalo padda oka premikudu thana preyasi kosam rasina modati kavith ....

నువు రాక ముందు జీవితమంటే nothing , నువు వచ్చి చేరంగానే అయిపోయవే every thing ...
కలలోన నీవే , కనులు తెరిచినా నీవే ... యద లోయలోకి తొంగి చూసినను నీవే ...

 నా గుండె చప్పుడు నీ పేరే , నీ శ్వాస ఎప్పుడు నను చేరే ...
నీ నిస్వాసలే నా ఉచ్వాసముగ బతుకుతున్నానే చెలీ వింటున్నావా ... హాఆఅ ....

                                                                                                                            || నువు రాక ముందు ||

నిను చూసిన తొలిసారి నేననుకోలేదే అసలు , నా జీవితమంటే నువు అవుతావని ...
నిను కలిసిన ప్రతిసారి సరి కొత్తలోకమే చూపి , నీ ప్రేమలోకంలో నను ముంచేసావే ...

కొత్తబంగారులోకం కావాలి మనకే సొంతం , అది అందుకోవాలి ఉండిపోవాలి కలకాలం ...
మరి ఏలుకోవాలి, నిండిపోవాలి ఆనందంతో మది బతికున్నంత కాలం , ఈ భువిపై ఉన్నంత కాలం ...

                                                                                                                           || నువు రాక ముందు ||

Sunday, October 19, 2014

ప్రేయసిని వీడలేక పరితపించే ఒక ప్రేమికుడి బాధే ఈ నా పాట .....

నేకన్న కలలు అన్నీ కల్లలాయను నేడే ఓ చెలియా నువు కానవా .....
నా ఆశల ఊసులన్నీ పంపుతున్నా నీకే నా సఖియా నువు చూడవా .....

నీ ఊహలలో నేనున్నా ..... నా ఊపిరివే నువ్వంటున్నా .....
కాలమెలా  పోతున్నా ..... నే కదలనని కూర్చున్నా .....

నీతో ఉన్న క్షణములే , అన్న మాటలే గుర్తుకొస్తుంటే నాకే ..... నువు లేని ప్రస్తుతం రాని జీవితం వద్దేవద్దని నీకై వస్తున్నా .....
ఓ చెలీ .............

నేకన్న కలలు అన్నీ కల్లలాయను నేడే ఓ చెలియా నువు కానవా .....
నా ఆశల ఊసులన్నీ పంపుతున్నా నీకే నా సఖియా నువు చూడవా .....

--
Vamc Gadu

Saturday, October 11, 2014

పచ్చాపచ్చని చీరకట్టి , గాలికి రెపరెపలాడే , నేలా తల్లి ఒళ్ళు నేడే నెర్రెలిచ్చేనా .... అయ్యో రైతన్నేమో మాయమయ్యేనా , అయ్యో రైతన్నే మాయమయ్యేనా ....
నాగలిబట్టి , దుక్కిదున్ని , విత్తునాటి , పైరుకోసి , కుప్పలేసి అమ్మబోతే మన్ను మిగిలేనా అన్నా నీ నోటి కాడికి కూడు చేరేనా .....
గద్దెలెక్కిన పెద్దలేమో రైతుయే మహరాజు అంటూ , రైతులేనిదే దేశమే లేనేలేదంటూ .... సభలు పెట్టి , మైకు పట్టి , ఊకదంపుడు దంచికొట్టి , చేయలేకో చేతగాకో చేయడానికి మనసు రాకో చల్లటేలా మెల్లగా జారుకుంటుంటే .....
ఎండ అనక , వానలనక , చలిని కూడా లెక్కచేయక , మండే సూరికెదురు నిలిచి సాగు చేస్తున్నా ..... పుడమి కడుపులో నీరు లేక పైరు ఏమో నేల చూపులు .... మింటి నుండి చుక్క రాలదు నీ కంటిలో కన్నీరు ఆగదు .....
కరువు కోరలు కాటువేయగ పొలము పండక బాధకుండగా , అరువు కాకులు చుట్టుముట్టి శ్వాసకూడా సలుపనీయక ..... నేల చేరని నీటి కోసం వెతికి వెతికి వేసారి , వెతకలేక ఆశ జారి ...... చివరి సారిగ వెతకడానికి నింగి చేరావా .... ఆ మబ్బులో కన్నీరు నింపి నేలకంపేవా .....
ఓ రైతన్నా ఆ మబ్బుల్లో నీ కన్నీరు నింపి నేలకంపేవా .....

Thursday, November 7, 2013

ప || white dressలోన angel తొలిసారి నేనిను చూసిన క్షణములు ,
facebookలోన chatting నిదురన్నదే మరి మరచిన దినములు ,
friday night shopping అలుపన్నదే మరి ఎరుగని కరములు ,
weekendsలోన outing పద పద పద పదమని తరిమిన పదములు ,

only for you ఈ feeling only for you .........
never i feel it , ఈ feeling only for you .........

చ ||
      he  - మాటలాడు కళ్ళు
      she - when ever i anger @ you
      he - పులకరించు ఒళ్ళు
      she - when ever i touch you
      he - పగటి పూట కలలు
      she  - ఆ కలలో నీతో ఉన్నది ఎవరో
      he  - ప్రతి కలలో మనమే , i never ever leave you

నా లోకమంత నీవే ....... నిండి ఉన్నావే .....
నిను వీడిన క్షణమే , మరు క్షణమే అన్నది ఉండదు నాకే , ఉండదు నాకే , ఉండదు నాకే .....

                                                                || white dressలోన angel  ||

Saturday, May 11, 2013

Dedicating to lovely MOMmmmmmmmmmmmmmm ...... I love U maaa :)



నే కనుపాపన బంధించిన తొలి రూపం అమ్మ , నను కనురెప్పగా కాపాడిన నా దేవత అమ్మ

స్వరపేటికలో పలికే తీయని పేరే అమ్మ , వెన్నంటి నిలిచే ఆధారమే అమ్మ

భువిపై ప్రతి మనిషికి సృష్టికర్త బ్రహ్మ , ఆ బ్రహ్మకు కూడా వుంది కదా అమ్మ

                                                                                                                  || నే కనుపాపన బంధించిన ||

కడుపులోన వున్నపుడు కాలితోటి తన్తుంటే , నా బిడ్డ నా బిడ్డని నవ్వుకుంటూ తిరిగావు

పుడుతూనే పురిటిలోనే నరకాన్నే చూపాను , పెరుగుతుంటే నీ ఒడిలో స్వర్గాన్ని చూపావు

అణువులా వచ్చాను , ఆయువే పోసావు

పేగు తెంచి పుట్టాను , ప్రేమ పంచి  పెట్టావు

                                                                                                                   || నే కనుపాపన బంధించిన ||

నా కంటిలో నలుసుకే నీ కళ్ళు చెమర్చాయి , నీ జోల పాటకవి కునుకమ్మని చేరాయి

చిన్న బాధ వస్తేనే తల్లడిల్లి పోయావు , తల్లిపేగు మమకారం కళ్ళలోనే చూపావు

నీ తోడే లేనిదే నా జన్మే శూన్యం , నీ నీడే దొరికిన ఈ  జన్మే ధన్యం

ఎన్నెన్ని జన్మలున్నా ప్రతి జన్మలోనా నీ బిడ్డగా పుట్టాలని వరం కోరుకోనా ......

                                                                                                                    || నే కనుపాపన బంధించిన ||

ఆ తరం అమ్మమ్మ -- ఈ తరం అమ్మాయి -- మధ్యలో అమాయకపు అమ్మ!!! Episode 2

Episode 2 ప్రభ ఈతరం అమ్మాయి , తన హద్దుల్లో తానుండేది , friends gang లో   అబ్బాయిలున్నప్పటికీ వాళ్ళకి ఎప్పుడూ అతి చనువు ఇచ్ఛ...